Leading News Portal in Telugu

NSG New Chief: ఎన్‌ఎస్‌జీ కొత్త డైరెక్టర్ జనరల్గా బి. శ్రీనివాసన్‌..


  • జాతీయ భద్రత దళం కొత్త డైరెక్టర్‌ జనరల్‌గా బి.శ్రీనివాసన్‌ నియామకం..

  • 2027 డిసెంబర్ ఆగస్టు 31 వరకు ఎన్‌ఎస్‌జీ డీజీ పదవిలో కొనసాగనున్న శ్రీనివాసన్‌..
NSG New Chief: ఎన్‌ఎస్‌జీ కొత్త డైరెక్టర్ జనరల్గా బి. శ్రీనివాసన్‌..

NSG New Chief: ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే జాతీయ భద్రత దళం కొత్త డైరెక్టర్‌ జనరల్‌గా (DG) సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బి.శ్రీనివాసన్‌ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. క్యాబినెట్‌ నియామకాల కమిటీ ఈ నియామకానికి ఆమోద ముద్ర వేసినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ నిన్న (మంగళవారం) వెల్లడించింది. బిహార్‌ క్యాడర్‌కు చెందిన 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన శ్రీనివాసన్‌ ప్రస్తుతం బిహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఇక, ఎన్ఎస్జీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 2027 ఆగస్టు 31 వరకూ ఎన్‌ఎస్‌జీ డీజీ పదవిలో శ్రీనివాసన్‌ కొనసాగనున్నారు.

అయితే, జాతీయ భద్రత దళం డైరెక్టర్‌ జనరల్‌ (ఎన్ఎస్‌జీ డీజీ)గా పని చేస్తున్న నళిన్ ప్రభాత్ పదవీ కాలాన్ని కేంద్ర ఇటీవల తగ్గించి వేసింది. ఆయనను జమ్మూ కశ్మీర్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియామకం చేసింది. ఆ తర్వాత సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనిష్ దయాల్ సింగ్‌కి ఎన్ఎస్‌జీ అదనపు బాధ్యతలను అప్పజెప్పింది. ఈ నేపథ్యంలోనే శ్రీనివాసన్‌ను కొత్త డీజీగా కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది.