posted on Aug 28, 2024 12:40PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మినిస్టర్లు, ఆఫీసర్లు నిర్వహించే ప్రెస్‌మీట్లలో మాట్లాడుతున్న వారి వెనుక రాష్ట్ర అధికార చిహ్నం మాత్రమే కనిపించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ చర్యలు చేపట్టింది. సెక్రటేరియట్?’లోని పబ్లిసిటీ సెల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించే ప్రాంతంలో అధికారిక చిహ్నం పెద్దగా కనిపించే తరహాలో ఏర్పాట్లు చేసింది. బోర్డు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కనిపించేలా తెలుగు, ఇంగ్లీషులో రాసి వుంది. మధ్యలో ఏపీ లోగో వుంది. అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాలలో కూడా ఇలాంటి తరహా ఏర్పాట్లే చేయనున్నారు. గతంలో వైసీపీ రాక్షస పాలన జరిగిన సమయంలో వైసీపీ జెండా రంగులతోపాటు జగన్ ఫొటో, నవరత్నాల లోగో కూడా వుండేవి.