Leading News Portal in Telugu

Shreyas Iyer: సునీల్ నరైన్ యాక్షన్‌ని కాపీ కొట్టిన శ్రేయస్ అయ్యర్.. (వీడియో)


  • 29 ఏళ్ల అయ్యర్ బుచ్చి బాబు టోర్నీలో ముంబై తరుపున ఆడుతున్నాడు.
  • అయ్యర్ బౌలింగ్‌ చేసాడు.
  • సోషల్ మీడియాలో వైరల్.
Shreyas Iyer: సునీల్ నరైన్ యాక్షన్‌ని కాపీ కొట్టిన శ్రేయస్ అయ్యర్.. (వీడియో)

Shreyas Iyer imitates KKR teammate Sunil Narine bowling action in Buchi Babu Trophy: గౌతమ్ గంభీర్ టీమిండియా క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ అయినప్పటి నుండి, చాలా మంది బ్యాట్స్‌మెన్స్ కూడా బౌలింగ్ చేస్తూనే ఉన్నారు. గంభీర్ మ్యాజిక్ ఇప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ పై కనిపించింది. మంగళవారం జరిగిన బుచ్చిబాబు టోర్నీలో అయ్యర్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఆల్ రౌండర్ సునీల్ నరైన్ తరహాలో బౌలింగ్ చేశాడు అయ్యర్‌. ఐపిఎల్‌ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) తరపున నరైన్, అయ్యర్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే.

Restaurant In Coach : రైలు కంపార్ట్‌మెంట్‌లో రెస్టారెంట్‌ పెట్టాలనుకుంటున్నారా.. ఇలా చేయండి

29 ఏళ్ల అయ్యర్ బుచ్చి బాబు టోర్నీలో ముంబై తరుపున ఆడుతున్నాడు. ముంబై టీఎన్‌సీఏ ఎలెవన్‌తో తలపడుతోంది. ఆగస్టు 27న మ్యాచ్ మొదటి రోజున అయ్యర్ బౌలింగ్‌ చేసాడు. నరైన్ లాగే అతను మొదట బంతిని దాచిపెట్టి, ఆపై విసిరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది. నరైన్ తరహాలో.. అయ్యర్ బౌలింగ్‌ను చూసి క్రికెట్ అభిమానులు ఆనందించారు. ఇప్పుడు భారత జట్టులోనూ నరైన్‌ కు కొరత ఉండదని సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ చేస్తున్నారు.

YSRCP vs TDP: కడప చెత్త వివాదం.. టీడీపీ, వైసీపీ నేతలపై కేసులు

ప్రస్తుతం భారత జట్టు విశ్రాంతిలో ఉంది. ఇలాంటి సమయంలో భారత ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నారు. అయ్యర్ త్వరలో దులీప్ ట్రోఫీలోకి అడుగుపెట్టనున్నాడు. శ్రీలంక టూర్‌లో ఫ్లాప్ అయ్యాడు. మూడు వన్డేల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో భారత్ టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది.