Leading News Portal in Telugu

హోటల్ గదుల్లో రహస్య కెమెరాలు… జంటలను  బ్లాక్ మెయిల్ 


posted on Aug 28, 2024 3:10PM

రహస్య కెమెరా ద్వారా రికార్డు చేసిన దృశ్యాలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్న హోటల్ యజమానిని పోలీసులు అరెస్ల్ చేశారు. యధాలాపంగా ఓ జంటను బ్లాక్ మెయిల్ చేయబోయి బొక్క బోర్లా పడ్డాడు సదరు వ్యక్తి. 

ఓయో రూమ్ లో రహస్య కెమెరా పెట్టి కస్టమర్లను బ్లాక్ మెయిల్ చేయడం అతని వృత్తిగా ఎంచుకున్నాడు.ఏళ్ల తరబడి బ్లాక్ మెయిల్ చేసినప్పటికీ  ఓ యజమాని నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో ఓ జంట ఫిర్యాదు చేయడంతో పోలీసులు  అప్రమత్తమయ్యారు. సదరు యజమానిని అరెస్టు చేశారు. విచారణలో ఈ తంతు చాలాకాలంగా చేస్తున్నానని, చాలామందిని ఇలాగే బ్లాక్ మెయిల్ చేశానని అంగీకరించాడు. 

 శంషాబాద్ లోని సితా గ్రాండ్ హోటల్ లో రహస్య కెమెరాల భాగోతం బయటపడింది. హోటల్ నిర్వాహకుడు ఓయోతో ఒప్పందం కుదుర్చుకుని  గదులను అద్దెకిచ్చేవాడు. ప్రేమజంటలకు మాత్రమే  అద్దెకు ఇచ్చేవాడు . ఈ నేపథ్యంలోనే తన హోటల్ గదులలో రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఆ గదిలో దిగిన వారు క్లోజ్ గా  గడిపినదంతా ఆ కెమెరాల ద్వారా రికార్డు చేశాడు. తర్వాత  ఆ వీడియోలు చూపిస్తూ జంటలను బ్లాక్ మెయిల్ చేసేవాడు.  లేదంటే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని చెప్పి డబ్బు గుంజేవాడు.తనకు కావాల్సినంత ఇస్తే ఆ ఫోటోలు, దృశ్యాలు డిలీట్ చేసేవాడు. 

తాజాగా జంట  ఫిర్యాదుతో పోలీసులు  కేసు నమోదు చేశారు. పోలీసులు సితా గ్రాండ్ హోటల్ పై దాడులు చేశారు.  రహస్య కెమెరాలు బయటపడ్డాయి. హోటల్ యజమాని సీసీ ఫుటేజి, రెండు  సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.