Leading News Portal in Telugu

KTR Warning Tweet: మళ్లీ చెప్తున్నా రాసి పెట్టుకో.. విగ్రహాలను తొలగిస్తాం..


  • కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా?..

  • నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే..
KTR Warning Tweet: మళ్లీ చెప్తున్నా రాసి పెట్టుకో.. విగ్రహాలను తొలగిస్తాం..

KTR Warning Tweet: మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకో.. తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తామని కేటీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది. సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీమీద ప్రేమ ఒలకబోసేది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొడ్డి దారిన పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి.. ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ.. అసలురంగు అందరికీ తెలుసని కీలక వ్యఖ్యలు చేశారు. నీ ఆలోచనల్లో కుసంస్కారం… నీ మాటలు అష్ట వికారం అంటూ మండిపడ్డారు.

Read also: Delhi Liquor Case: సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణ సెప్టెంబర్ 11వ తేదీ వాయిదా..

తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన.. నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకో.. తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం.. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం.. జై తెలంగాణ అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Read also: Jagadish Reddy: మోడీ దగ్గర రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి , బండి లకు లేదు..

రాష్ట్ర సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే (డిసెంబర్ 9) తెలంగాణ తల్లి పండుగను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేందుకు గత పాలకులకు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నాయకులను విమర్శించారు. విగ్రహ ప్రతిష్ఠాపనను తెరవెనుక చేశారని మండిపడ్డారు. గత పాలకులు తెలంగాణ వారిదే అన్నట్లుగా వ్యవహరించారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jagadish Reddy: మోడీ దగ్గర రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి , బండి లకు లేదు..