- మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన సరిగా లేదు- చంద్రబాబు
- ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు వారి కారణంగా దెబ్బ తింటోంది- సీఎం
- మంత్రులు జాగ్రత్తగా ఉండాలి- చంద్రబాబు
- జిల్లాల్లో ఎమ్మెల్యేలు.. నాయకులను మంత్రులు గైడ్ చేయాలి- సీఎం.

కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని సీఎం తెలిపారు. మీడియా నిండా వాళ్లు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయన్నారు. దీని వల్ల అందరికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులను మంత్రులే గైడ్ చేయాలని సూచించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులది, ఎమ్మెల్యేలదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
కాగా.. సచివాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే.. ఈ భేటీలో పలు అంశాలపై కీలక చర్చలు జరిగాయి. కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై కీలక చర్చలు జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులంతా హాజరైన ఈ సమావేశంలో పలు అంశాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. రివర్స్ టెండర్ విధానం రద్దు చేసింది కేబినెట్.. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం లభించింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ప్రస్తుత పనులు చేపడుతోన్న కాంట్రాక్టు సంస్థతోనే పనులు కొనసాగించేందుకు అంగీకారం తెలిపింది.. ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం లభించింది.