Leading News Portal in Telugu

MLC Kavitha : హైదరాబాద్‌కు చేరుకున్న కవిత


  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న కవిత
  • ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హైదరాబాద్‌కు కవిత
  • కవిత వెంట కేటీఆర్‌.. కుటుంబ సభ్యులు..
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద భారీగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు
MLC Kavitha : హైదరాబాద్‌కు చేరుకున్న కవిత

ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలైన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కె. కవిత బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమెను బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది . శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. తీహార్ జైల్లో ఉన్న కవిత దాదాపు ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీలతో ఆమెకు ఘనస్వాగం పలికారు. కవిత వెంట ఆమె భర్త అనిల్, కేటీఆర్, హరీష్‌ రావు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కవిత ఎయిర్‌పోర్ట్‌ నుంచి ర్యాలీగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకుంటారు. గురువారం ఎర్రవెల్లిలోని ఫామ్‌ హౌస్‌ చేరుకొని తండ్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌తో సమావేశం కానున్నారు.

Wolf Attack: వేటాడుతున్న తోడేళ్లు.. యూపీలో 8 మంది మృతి..