Leading News Portal in Telugu

Purushothamudu OTT: ఓటీటీలోకి వచ్చేసిన పురుషోత్తముడు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?


  • హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పురుషోత్తముడు.
  • జూలై 26న విడుదలైన పురుషోత్తముడు రిలీజ్.
  • గురువారం అర్ధరాత్రి నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Purushothamudu OTT: ఓటీటీలోకి వచ్చేసిన పురుషోత్తముడు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?

Purushothamudu OTT Streaming in AHA: యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పురుషోత్తముడు. రామ్ భీమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ చిత్రంలో హాసిని సుధీర్ హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన మొదలగు నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ తరుణ్, లావణ్య చుట్టూ ఉన్న వివాదాల కారణంగా.., పురుషోత్తముడు విడుదలకు ముందే చాలా బజ్ క్రియేట్ చేసింది. అంతేకాదు రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులు కూడా ఉండటంతో రాజ్ తరుణ్ సినిమాపై అంచనాలు ఉన్నాయి.

Kavitha First Tweet: 165 రోజుల విరామం తర్వాత కవిత ట్విట్టర్ పోస్ట్ వైరల్‌..

ఇకపోతే జూలై 26న విడుదలైన పురుషోత్తముడు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గతంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు లాంటి కధాంశంతో రావడంతో రాజ్ తరుణ్ సినిమాపై జనాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. చాలామంది దీన్ని ఖచ్చితంగా OTT లో చూద్దాంలే అని సరిపెట్టుకున్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు పురుషోత్తముడు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ‘ ఆహా ‘ రాజ్ తరుణ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇదివరకే ఆగస్ట్ 29 నుండి సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే పురుషోత్తముడు సినిమా గురువారం అర్ధరాత్రి నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Earthquake: ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7గా తీవ్రత..