Leading News Portal in Telugu

Haj Yatra 2025: వచ్చే ఏడాది నుంచి హజ్ యాత్రలో కొత్త నిబంధనలు.. అవెంటంటే..?


  • వచ్చే ఏడాది హజ్ యాత్రలో చాలా మార్పులు

  • కొత్త నిబంధనలు.. మార్పులు తీసుకొచ్చిన సౌదీ అరేబియా ప్రభుత్వం
    ప్రధానంగా వయస్సు మార్పు

  • రిజర్వ్ కేటగిరీ వయస్సు 70 నుండి 65 సంవత్సరాలకు తగ్గింపు

  • హజ్ యాత్రకు వచ్చిన భార్యాభర్తలు కలిసి ఒకే గదిలో ఉండకూడదనే పరిమితి విధింపు.
Haj Yatra 2025: వచ్చే ఏడాది నుంచి హజ్ యాత్రలో కొత్త నిబంధనలు.. అవెంటంటే..?

వచ్చే ఏడాది హజ్ యాత్రలో చాలా మార్పులు కనిపించబోతున్నాయి. సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్త నిబంధనలు, మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు జారీ చేసిన మినహాయింపులను రద్దు చేసింది. అందులో ప్రధానంగా వయస్సు మార్పు. ఇందులో రిజర్వ్ కేటగిరీ వయస్సు 70 నుండి 65 సంవత్సరాలకు తగ్గించారు. మరొకటి.. హజ్ యాత్రకు వచ్చిన భార్యాభర్తలు కలిసి ఒకే గదిలో ఉండకూడదనే పరిమితి విధించింది. వారు వేర్వేరు గదుల్లో బస చేయాల్సి ఉంటుందని తెలిపింది.

హజ్ తీర్థయాత్రకు సంబంధించి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను విడుదల చేసింది. కమిటీ ప్రకారం.. హజ్ సమయంలో భారతీయ భార్యాభర్తలు ఒకే గదిలో ఉంటున్నారని ఫిర్యాదులు వచ్చాయి. భార్యాభర్తల మధ్య గదిలో సహజీవనం చేయడం వారి మధ్య విభేదాలకు దారితీస్తుంది. ఇతర దేశాల నుంచి వెళ్లే భార్యాభర్తలు వేర్వేరు గదుల్లో ఉంటారు. కేవలం భారతీయ భార్యా భర్తలు మాత్రమే కలిసి ఉండేందుకు అనుమతి ఉండేది. కాగా.. ఆ నిబంధనను రద్దు చేశారు. ఈ విషయాన్ని హజ్ కమిటీ అరబ్ ప్రభుత్వానికి తెలియజేసింది.

హజ్ కమిటీ ప్రకారం.. భార్యాభర్తల కోసం గదులు దగ్గర దగ్గరగానే ఉండనున్నాయి. తద్వారా వారు ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. హజ్ యాత్రికుల కోసం వసతి కల్పించే హోటల్‌లోని ప్రతి అంతస్తులో రిసెప్షన్ ఉంటుంది. ఈ క్రమంలో.. దంపతులు అక్కడ కలిసి కూర్చుని మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం హజ్ కమిటీ హజ్ యాత్రికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. సెప్టెంబర్ 9 వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజు 300 రూపాయలు రద్దు చేసింది. అదే సమయంలో 1000 రూపాయలుగా ఉన్న ఫెసిలిటీ లేదా కన్వీనియెన్స్ ఫీజును ప్రభుత్వం రూ. 2 వేలు చేసింది.