- యూరప్ టీనేజర్లలో తగ్గుతున్న కండోమ్ వాడకం..
-
అసురక్షిత లైంగిక చర్యలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..

Condom Use: యూరప్ దేశాల్లో లైంగికంగా చురుకుగా ఉండే టీనేజర్లలో కండోమ్‌ల వాడకం గత దశాబ్ధ కాలంగా తగ్గుతోందని, అసురక్షితమైన సెక్స్ రేట్ పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. కండోమ్‌ల వాడకం తగ్గడం వల్ల లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు(STIs), ప్రణాళిక లేని గర్భాలు ప్రమాదాలను పెంచుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ యూరప్ ఒక ప్రకటనలో తెలిపింది.
మధ్య ఆసియాతో పాటు యూరోపియన్ ప్రాంతంలోని 53 దేశాల్లో 42 దేశాల్లో 15 ఏళ్ల వయసు కలిగిన 2,42,000 కంటే ఎక్కువ మందిపై జరిపిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో వారు చివరిసారిగా కండోమ్‌ని ఉపయోగించి లైంగిక చర్య జరిపిన టీనేజ్ అబ్బాయిల నిష్పత్తిని చూపించారు. 2014లో 70 శాతం ఉంటే ఇది 2024లో 61 శాతానికి పడిపోయింది. చివరిసారిగా సెక్స్ చేసినప్పుడు కండోమ్ ఉపయోగించామని చెప్పిన బాలిక సంఖ్య 63 శాతం నుంచి 57 శాతానికి పడిపోయింది.
దాదాపుగా మూడొంతుల మంది కౌమారదశలో ఉన్నవారు తాము చివరిసారిగా సెక్స్ చేసుకున్న సమయంలో కండోమ్ లేదా గర్భనిరోదక మాత్రలను ఉపయోగించలేదని, ఇది 2018 నుంచి పెద్దగా మారలేదని చెప్పారు. గర్భనిరోధక మాత్రల వాడకం కూడా 2014-2022 మధ్య సాపేక్షంగా స్థిరంగా ఉంది. 15 ఏళ్ల వయసులో 26 శాతం మంది మాత్రమే తాము చివరిసారిగా సెక్స్ చేసిన సమయంలో ఉపయోగించామని చెప్పారు.
తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన యుక్తవయస్కులు కండోమ్ లేదా మాత్రలు ఉపయోగించకపోవచ్చని నివేదిక తెలిపింది. 33 శాతం మంది తాము చివరిసారిగా కలిసినప్పుడు వేటిని కూడా ఉపయోగించలేదని చెప్పారు. సంపన్న కుటుంబాలకు చెందిన వారిలో 26 శాతం మంది మాత్రమే వాటిని ఉపయోగించలేదని చెప్పారు.