- కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం..హత్య కొలిక్కి వచ్చేలా లేదు
- తాజాగా డెత్ సర్టిఫికెట్ కి సంబంధించిన అంశంపై చర్చ
- మరణ ధృవీకరణ పత్రంలో సమయం మార్పు!కేసులో కొత్త ట్విస్ట్

కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు పౌర వాలంటీర్ సంజయ్ రాయ్ మినహా ఎవరినీ అరెస్టు చేయలేదు. ఇదిలా ఉండగా.. వైద్యురాలి మృతికి సంబంధించి విచారణలో నిరంతరం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైనీ డాక్టర్ మరణానంతరం తాజాగా డెత్ సర్టిఫికెట్ కి సంబంధించిన అంశం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 9వ తేదీ ఉదయం ఆర్‌జీ కర్ సెమినార్ రూమ్ నుంచి డాక్టర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రానికి ఈ వార్త కుటుంబ సభ్యులకు చేరింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఆర్జీ కార్ వద్ద జూనియర్ డాక్టర్లు నిరసన ప్రారంభించారు. ఫోరెన్సిక్ పరీక్ష అనంతరం అదే రోజు బాధితురాలికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం రాత్రి తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. ఆ రాత్రికి దహన సంస్కారాలు జరిగాయి.
READ MORE: Perni Nani: ఎన్నికల్లో ఓటమి వల్ల పార్టీ పని అయిపోదు.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య బాధితురాలు మృతి చెందింది. ఇప్పుడు .. ఓ జాతీయ మీడియా సంస్థ ప్రకారం.. బాధితురాలిని దహనం చేసిన పానిహతి శ్మశాన వాటిక రిజిస్టర్‌లో మరణించిన సమయం 12:44 PM అని వ్రాయబడింది. ఈ రిజిస్టర్‌ను చూసిన తర్వాత.. దహన ధృవీకరణ పత్రం లేదా ఘాట్ సర్టిఫికేట్ తయారు చేయబడుతుంది. ఆ తర్వాత రెండు డాక్యుమెంట్లలో పేర్కొన్న సమయానికి ఇంత తేడా ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యత్యాసంపై బాధితురాలి తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. వైద్యురాలి తండ్రి మాట్లాడుతూ.. “నా కూతురిపై అత్యాచారం, హత్య వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు చేస్తున్న కుట్ర పన్నుతున్నారు.” అని ఆందోళన వ్యక్తం చేశారు.