Leading News Portal in Telugu

Constable: ఆసక్తికరంగా వరుణ్ సందేశ్ “కానిస్టేబుల్” మోషన్ పోస్టర్


Constable Motion Poster Launched: వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి “కానిస్టేబుల్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వరుణ్ సందేశ్ కి జోడిగా మధులిక వారణాసి హీరోయిన్ గా పరిచయం కానున్న ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను నిర్మాత కుమార్తె జాగృతి జన్మదినం సందర్భంగాగా బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, “సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లుగా మోషన్ పోస్టర్ కూడా చాలా బాగా వచ్చింది.

సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో కానిస్టేబుల్ గా కొత్త కోణం కలిగిన పాత్రలో నటిస్తున్నా, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా, తప్పకుండా ఈ చిత్రం నా కెరీర్ ను మరో మలుపు తిప్పుతుంది” అని చెప్పారు. నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ, “కథ, కధనాలు అద్భుతంగా అమరిన చిత్రమిది. పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకుంటారు” అని పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటిస్తున్నారు.