Leading News Portal in Telugu

Chiranjeevi – Allu Arjun: మెగా vs అల్లు వివాదం.. ఒకే వేదికపై చిరు, బన్నీ?


Chiranjeevi – Allu Arjun: మెగా vs అల్లు వివాదం.. ఒకే వేదికపై చిరు, బన్నీ?

Chiranjeevi – Allu Arjun to attend Balakrishna 50 Years Celebrations: అల్లు అర్జున్ ‘నాకు ఇష్టమైతేనే వస్తా’ కామెంట్స్ పెద్ద కలకలమే రేపాయి. మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన ఈ మాటలను మెగా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఏకంగా జనసేన ఎమ్మెల్యే ఒకరు అల్లు అర్జున్ ఏమైనా పుడింగా అని ప్రశ్నించే స్థాయికి ఈ వివాదం చేరింది. ఇక ఇలా అల్లు – మెగా కుటుంబాల మధ్య దూరం పెరిగిపోతోంది అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకే వేదికపైకి అల్లు అర్జున్, చిరంజీవి రానుండడం చర్చనీయాంశం అవుతోంది. అసలు విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు.

Nani: అలసి సొలసిన వివేక్ ఆత్రేయ.. క్లిక్ మనిపించిన నాని

ఈ క్రమంలో తెలుగులో టాప్ హీరోలను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా చిరంజీవిని ఆహ్వానించగా ఆయన వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ని కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ అనుపమ రెడ్డి, మా అసోసియేషన్ నుండి మాదాల రవి, శివ బాలాజీ, నిర్మాత ముత్యాల రామదాసు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వానించడానికి వచ్చిన సినీ పెద్దలతో అల్లు అర్జున్ గారు సానుకూలంగా స్పందిస్తూ బాలకృష్ణతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారట. దీంతో ఒకేవేదిక మీదకు చిరంజీవి, బన్నీ రానున్నారు అని తెలుస్తోంది. దీంతో ఏం జరగనుంది? అనేది తెలియాల్సి ఉంది.