Leading News Portal in Telugu

Varalakshmi Vratham: శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. వారికి అన్నీ ఉచితం..


  • శ్రీశైలంలో నాలుగోవ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు..

  • చంద్రవతి కళ్యాణ మండపంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు..

  • 5 వందల మంది చెంచు ముత్తైదువులు..

  • వేయి మంది సాధారణ మహిళలకు ఉచితంగా అవకాశం..
Varalakshmi Vratham: శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. వారికి అన్నీ ఉచితం..

Varalakshmi Vratham: ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో నాలుగోవ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు.. శ్రీశైలంలోని చంద్రవతి కళ్యాణ మండపంలో 5 వందల మంది చెంచు ముత్తైదువులు.. వేయి మంది సాధారణ మహిళలు.. ఉచితంగా ఈ వరలక్ష్మి వ్రతంలో పాల్గొని అవకాశం కల్పిస్తున్నారు.. ఇక, వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే మహిళలకు పూజా సామాగ్రి, చీర అందజేయనుంది శ్రీశైలం దేవస్థానం పాలకమండలి.. వరలక్ష్మి వ్రతం అనంతరం మహిళలకు శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు..

తెలుగు రాష్ట్రాల్లో శ్రావణమాసం సందడి కొనసాగుతుండగా.. ఈదే చివరి శ్రావణ శుక్రవారం కావడంతో.. పలు ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు.. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ధార్మిక కార్యక్రమంలో భాగంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నారు. ఇందులో 1500మంది మహిళలకు ఉచితంగా అనుమతి ఉంటుంది. రెండో శుక్రవారం రోజు కూడా ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించగా.. ఈ రోజు చివరి శుక్రవారం సందర్భంగా మరోసారి వ్రతాలు నిర్వహిస్తున్నారు. కాగా, శ్రావణం మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం.. ఈనెలలో వరలక్ష్మీ వ్రతం చేసుకొని అమ్మవారిని మనసారా పూజించే విషయం విదితమే.