Leading News Portal in Telugu

Nani: అలసి సొలసిన వివేక్ ఆత్రేయ.. క్లిక్ మనిపించిన నాని


Nani: అలసి సొలసిన వివేక్ ఆత్రేయ.. క్లిక్ మనిపించిన నాని

Nani Clicks Vivek Athreya Napping Pic : నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29వ తేదీన అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్జే సూర్య విలన్ గా నటించిన ఈ సినిమాని ముందు నుంచి భిన్నంగా ప్రమోట్ చేస్తూ వచ్చింది సినిమా యూనిట్. సినిమా కథ లైన్ లీక్ చేసి వివేక్ ఆత్రేయ స్క్రీన్ ప్లే కోసం సినిమాకి రావాలంటూ పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. ఇక ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది.

Saripodhaa Sanivaaram Review: నాని సరిపోదా శనివారం రివ్యూ.. హిట్ కొట్టాడా?

ఈ క్రమంలో హీరో నాని ఈ సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఫోటోను ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో వివేక్ ఆత్రేయ నిద్ర పోతున్నట్టు కనిపిస్తుండగా ఇది నీకోసమే అంటూ నాని రాసుకొచ్చాడు. ఇక సరైన హిట్ కొట్టేసి వివేక్ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి. సరిపోదా శనివారం సినిమాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించారు. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా సాయికుమార్, మురళీ శర్మ వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించారు.. జేక్స్ బిజాయ్ సంగీతం అందించిన ఈ సినిమాకి అదే ప్లస్ పాయింట్ అయింది అని చెప్పొచ్చు.