Leading News Portal in Telugu

AP Rains: ఏపీలో అతిభారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ


  • ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన
AP Rains: ఏపీలో అతిభారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ

AP Rains: ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో శుక్ర శనివారాలలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.