
ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇళ్లు కూల్చొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో చెరువులు, నాలలలో వున్న నిర్మాణాలను తొలగిస్తున్న సందర్భంగా పేదలు, మధ్యతరగతి ప్రజానీకం దీనికి సమిధలు కాకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో జలవనరుల సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్ధ ఆహ్వానించదగ్గదేనన్నారు. అయినప్పటికీ చెరువులు, నాలల పక్కన సంవత్సరాలుగా నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా వారి ఇళ్లను కూల్చవద్దని సిపిఐ(యం) తెలంగాణ రాష్ట్రకమిటీ ప్రభుత్వాన్ని కోరుతున్నదని, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 12 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 78 మంది వికలాంగులకు ఇళ్లపట్టాలు ఇచ్చిందన్నారు తమ్మినేని వీరభద్రం. ఆ ఇళ్లను ఆక్రమణల పేరుతో గురువారం తెల్లవారుజామున బుల్డోజర్లతో కూల్చివేశారని, సంవత్సరాలు తరబడి అక్కడే నివాసముంటూ కాయకష్టం చేసుకుంటూ బ్రతుకుతున్న పేదలు బజారున పడ్డారు. వీరిని తక్షణం ఆదుకోవాలన్నారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ లోని హస్మత్‌పేట్, ఆల్వాల్ తదితర బస్తీలలో కూడా పేదల ఇళ్లు నేలమట్టం చేశారు. ఆక్రమణలు, ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌ల పేరుతో ప్రత్యామ్నాయం చూపకుండా పేదలు, మధ్యతరగతి వారిని బజారుపాలు చేయవద్దని సిపిఐ(ఎం) రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు.
Hair fall: వానాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా చేయండి