Leading News Portal in Telugu

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే!


  • ఒక్క రోజే నాలుగు పతకాలు
  • షూటింగ్‌లోనే 3 పతకాలు
  • నేటి భారత్ షెడ్యూల్ ఇదే
Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే!

పారిస్ పారాలింపిక్స్‌ 2024లో భారత క్రీడాకారుల పతక వేట ఘనంగా ఆరంభమైంది. శుక్రవారం ఒక్క రోజే నాలుగు పతకాలు ఖాతాలో చేరాయి. ఇందులో ఓ స్వర్ణం కూడా ఉంది. టోక్యోలో స్వర్ణం, కాంస్యం గెలిచిన యువ షూటర్‌ అవని లేఖరా.. పారిస్‌లోనూ గోల్డ్ గెలిచింది. షూటింగ్‌లోనే మనీశ్‌ నర్వాల్‌ రజతం, మోనా కాంస్యం గెలిచారు. ఇక 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్‌ కంచు పతకం సాధించింది. నేడు కూడా భారత్ ఖాతాలో పతకాలు చేరే అవకాశాలు ఉన్నాయి. నేటి భారత్ షెడ్యూల్ ఓసారి చూద్దాం.

నేటి భారత్ షెడ్యూల్:
పారా షూటింగ్‌: పురుషుల 10మీ ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1 క్వాలిఫికేషన్‌ (స్వరూప్‌)- మధ్యాహ్నం 1, ఫైనల్‌- మధ్యాహ్నం 3.45
మహిళల 10మీ ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 క్వాలిఫికేషన్‌ (రుబీనా)- మధ్యాహ్నం 3.30, ఫైనల్‌- సాయంత్రం 6.15

పారా సైక్లింగ్‌: మహిళల సీ1-3 500మీ టైమ్‌ ట్రయల్‌ క్వాలిఫయింగ్‌ (జ్యోతి)- మధ్యాహ్నం 1.30, ఫైనల్‌- సాయంత్రం 5.05;
పురుషుల సీ1-3 1000మీ టైమ్‌ ట్రయల్‌ క్వాలిఫయింగ్‌ (షేక్‌ అర్షద్‌)- మధ్యాహ్నం 1.49, ఫైనల్‌- సాయంత్రం 5.32

పారా ఆర్చరీ: మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత ప్రిక్వార్టర్స్‌ (సరిత × ఎలెనోరా)- రాత్రి 7, (శీతల్‌ × మారియానా)- రాత్రి 8.59, పతక రౌండ్లు- రాత్రి 11.13

పారా అథ్లెటిక్స్‌: పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్‌ (పర్వీన్‌ కుమార్‌)- రాత్రి 10.30