- తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు..
-
భారీ వర్షాల కారణంగా పలు ప్రాజెక్టుల్లోకి వరద నీరు..

Telangana Projects: తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులు, వాగులు నిండాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. భారీ వర్షం కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.
Read also: AP Secretariat: సచివాలయంలో వైసీపీ కోవర్టులు..! ప్రక్షాళన చేపట్టిన సీఎస్.. వారికి స్థాన చలనం
మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు కు భారీగా వరద నీరు చేరింది. దీంతో ఇన్ ఫ్లో: 3,20,000 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో: 3,24,999 క్యూసెక్కులుగా వుంది.
45 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని మూడు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేపట్టారు. దీంతో పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరద కొనసాగుతుంది. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా.. ప్రస్తుతం 404.50 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇన్ ఫ్లో 13000 క్యూసెక్కులు కాగా.. డ్యాం 3 గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
Read also: AP Secretariat: సచివాలయంలో వైసీపీ కోవర్టులు..! ప్రక్షాళన చేపట్టిన సీఎస్.. వారికి స్థాన చలనం
కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. సంగంబండ రిజర్వాయర్ పోటెత్తిన భారీ వరద ఉదృతికి 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేపట్టారు అధికారులు. కర్ణాటక -తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షానికి మక్తల్ మండలం సంగంబండ రిజర్వాయర్ కు వరద పోటెత్తింది. 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. ఇన్ ఫ్లో : 2400 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 2400 క్యూసెక్కులు, పూర్తిస్థాయి నీటి నిల్వ: 3.317 టీఎంసీ. ప్రస్తుత నీటి నిల్వ : 2.030 టీఎంసీలుఆ కొనసాగుతుంది.
Helicopter Crash: కేదార్‌నాథ్‌లో కూలిపోయిన హెలికాప్టర్..