Leading News Portal in Telugu

దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిది పెద్ద ప్లానే! | duvvada audio leak| duvvada srinivas madhuri| duvvada srinivas divvela madhuri


posted on Aug 31, 2024 7:11PM

వామ్మో… వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మామూలోడు కాదు.. మహా జాదూ.. అందుకే ఆయన భార్య వాణి, కుమార్తెలు దువ్వాడని అంతలా వ్యతిరేకిస్తున్నారు. మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ ఇష్యూగా మారిన దువ్వాడ ‘ఆయనకిద్దరు’ వ్యవహారం ఈమధ్యకాలంలో చల్లబడింది. ఇప్పుడు ఆ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. దువ్వాడ వారి రాసలీలల స్టోరీ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఎంత మాస్టర్ కిలాడీలో బయటపెట్టే ఆధారం బయటకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి జీవితంలోకి ప్రవేశించిన మూడో మనిషి దివ్వెల మాధురి యాక్సిడెంట్ చేయడం, దువ్వాడ వాణి పెట్టిన టార్చర్ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవడానికే యాక్సిడెంట్ చేశానని చెప్పడం అందరికీ తెలిసిందే. అయితే, అయి నిజంగా జరిగిన యాక్సిడెంటేనని, ఆత్మహత్యాయత్నం కోసం చేసిన యాక్సిడెంట్ కాదని బయటపడింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో బయటపడింది. దివ్వెల మాధురికి యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆమెని అంబులెన్స్.లో ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో దువ్వాడ శ్రీనివాస్‌కి ఆమె ఫోన్ చేసింది. ఇలా తనకు యాక్సిడెంట్ జరిగిందని, తనను అంబులెన్స్.లో ఆస్పత్రికి తీసుకెళ్తున్నారని మాధురి చెప్పింది. అప్పుడు దువ్వాడ శ్రీనివాస్‌లో వున్న అసలు సిసలు వైసీపీ లీడర్ బయటకి వచ్చాడు. అయితే, నువ్వు పోలీసులకి, మీడియాకి ఆత్మహత్య చేసుకోవడానికే యాక్సిడెంట్ చేశానని చెప్పు. దువ్వాడ వాణి నన్ను వేధించినందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని చెప్పు. మిగతా అన్ని విషయాలు నేను చూసుకుంటాను అని మాధురికి చిలకకి చెప్పినట్టు చెప్పాడు. మాధురి కూడా అయితే నా దగ్గరకి వెంటనే మీడియాని పంపు.. నువ్వు చెప్పమన్నట్టే చెబుతాను అని చెప్పింది. ఈ ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం అలా వుంచితే, ఇంత రచ్చ చేసిన దివ్వెల మాధురిని ఇంకా పోలీసులు ఎందుకు అరెస్టు చేయాలేదో అర్థం కావడం లేదు. యాక్సిడెంట్ చేయడం, ఇలా పోలీసులను, మీడియాని తప్పుదోవ పట్టించడం లాంటి నేరాలు చేసిన మాధురి హ్యాపీగా రీల్స్ చేసుకుంటూ, మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ టైమ్‌పాస్ చేస్తోంది. ఇప్పుడు ఈ ఫోన్ కాల్ లీక్ తర్వాత అయినా పోలీసులు దువ్వాడ మాధురి విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటారేమో చూడాలి.