Leading News Portal in Telugu

Srisailam Project: కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం జలాశయానికి భారీ వరద


Srisailam Project: కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం జలాశయానికి భారీ వరద

Srisailam Project: తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 8 గేట్లు 12 అడుగులు, మరో 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు ఇన్ ఫ్లో 3,26,481 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. 3,80,499 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిగా నిండి నిండుకుండలా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 215.8070 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం గేట్లన్నీ ఎత్తివేయడంతో ఆ అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలి వెళ్తున్నారు.