
రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు సెలవులు పెట్టొద్దన్నారు. స్థానిక పరిస్థితుల మేరకు రేపు స్కూల్స్ కు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఖమ్మంలో నాకు కావాల్సిన ఓ ముస్లిం కుటుంబం వరదల్లో చిక్కుకుందని, వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉందని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దన్నారు. వరద భారీగా వస్తుంది. ప్రకృతి సహరించడం లేదు. NDRF బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయన్నారు.
NBK50Years: బాలయ్య ఈ రికార్డ్స్ ను బద్దలు కొట్టడం ఎవరివల్ల కాదు.. అవేంటో తెలుసా.?..?
కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడారని, కేంద్రం నుంచి కావాల్సిన తక్షణ సహాయం అందిస్తామని చెప్పారన్నారు. అయితే.. మీడియా సమావేశంలో భావోద్వేగానికి లోనైయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. తన నియోజకవర్గం పాలేరులో యాకూబ్ అనే ఇటుకలు తయారు చేసే కూలీ కుటుంబం వరదలో కొట్టుకపోవడంతో కన్నీరు పెట్టుకున్నారు పొంగులేటి… కూలీ యాకూబ్ కొడుకు ను మాత్రం రెస్క్యూ టీం కాపాడగలిగిందని, కుటుంబ సభ్యులు దొరకాలని పొంగులేటి భగవంతుని ప్రార్థించారు. హెలికాప్టర్ కోసం ప్రయత్నించినా వాతావరణం సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు పొంగులేటి..
Kanguva Release Date: ఆ సినిమా రిలీజ్‌కు దారి ఇవ్వాలి.. కంగువ విడుదలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!