posted on Sep 1, 2024 10:57PM
విజయవాడలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వద్ద కృష్ణానది కరకట్టకు గండిపడే ప్రమాదాన్ని రైతులు ఆదివారం రాత్రి గుర్తించారు. కట్ట నుంచి వరద నీరు లీక్ అవ్వడాన్ని గుర్తించిన రాజధాని రైతులు కట్టమీదకు చేరుకొని గండి పూడ్చే పనులు స్వచ్చందంగా చేపట్టారు. వెంటనే అధికారులకు కూడా సమాచారం అందించారు. అధికారులు త్వరగా స్పందించకుంటే వరద నీరు సీడ్ యాక్సిస్ రోడ్డు పైకి వస్తుందని రైతులు భయాందోళనలు వ్యక్తం చేశారు.