- విజయవాడ రామలింగేశ్వర నగర్ లో భారీగా వరద నీరు..
-
7వ లైన్లో రిటైనింగ్ వాల్ లీక్ అవ్వడంతో కాలనీలోకి వరద నీరు.. -
పోలీస్ కాలనీ వద్ద రిటైనింగ్ వాల్ లాక్స్ బ్రేక్ అయినట్లు చెబుతున్న స్థానికులు…

Ramalingeswara Nagar: విజయవాడ నగరంలోని రామలింగేశ్వర నగర్ లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఏడోవ లైన్లో ఉన్న రిటైనింగ్ వాల్ లీక్ అవ్వడంతో కాలనీలోకి నీరు చేరింది. పోలీస్ కాలనీ వద్ద రిటైనింగ్ వాల్ లాక్స్ బ్రేక్ అయినట్లు స్థానికులు చెబుతున్నారు. ముంప్పు ప్రాంతాల వారిని పునానవాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. ఇక, రామలింగేశ్వర నగర్ కు వరద ముంపు పొంచి ఉండటంతో.. కృష్ణానది రిటైనింగ్ వాల్ దాటి వరద నీరు ఆ ప్రాంతంలోనికి చేరుకుంటుంది. దీంతో రామలింగేశ్వర నగర్ ప్రమాదం అంచనా ఉందని స్థానికులు తెలియజేస్తున్నారు. మరికొన్ని చోట్ల అడుగు మేర వరకు మాత్రమే టర్నింగ్ వాల్ కనబడుతుంది. దీంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.. వారిని సురక్షిత ప్రాంతాలకు రెస్య్కూ టీమ్ తరలిస్తుంది. పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ ఆయా ప్రాంతాల్లోకి కూడా వరద నీరు భారీగా చేరుతున్నది.
అలాగే, కృష్ణాజిల్లాలోని తోట్లవల్లూరు మండలంలోని ములకలపల్లి లంక – కనిగిరి లంక గ్రామాల మధ్య పెట్రోలింగ్ తిరుగుతున్న బోటు బోల్తా పడింది. అయితే, బోటులో ఉన్న ఎనిమిది మంది సేఫ్ గా ఉన్నారు. విద్యుత్ తీగలు అడ్డు రావడంతో తప్పించే క్రమంలో పక్కకు వంచడంతో బోల్తా పడిన పడవ.. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ముగ్గురు, బోటు నడిపే వ్యక్తులు ఇద్దరు, రూట్ చూపించే గ్రామస్తులు ఇద్దరు ఉన్నారు. గల్లంతైన వ్యక్తి చెట్లును పట్టుకుని ఉండటంతో తాడు సహాయంతో అతడ్ని బయటికి రెస్క్యూ టీమ్ తీసింది.