
కోదాడ, హుజుర్‌నగర్ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. వర్ష ఉధృతికి గండ్లు పడ్డ ప్రాంతాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శిస్తున్నారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం రామచంద్రాపురం శివారులో సాగర్ ఎడమ కాలువకు పడిన గండిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ రెడ్డిలు పరిశీలించారు. వీరితో పాటు నీటిపారుదల శాఖాధికారులు సి.ఇ రమేష్ బాబు, యస్.ఇ శివధర్మ తదితరులు పాల్గొన్నారు. అదే క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని హుజుర్నగర్, మఠంపల్లి,మెల్లచేరువు, చింతలపాలెం మండలాల్లో పర్యటించనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని.. ప్రభుత్వ అధికారుల సహాయంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లవద్దని ఆయన సూచించారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని.. తద్వారా వారిని రక్షించి పునరావాస ప్రాంతాలకు తరలించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ఏర్పాటు చేయవచ్చని ఆయన అన్నారు.
Kolkata Doctor Case : రక్తంతో తడిసి పోయిన డాక్టర్ ను చూశానంతే.. కోల్ కతా కేసులో నిందితుడు యూటర్న్