
Rescue Operations: తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఖమ్మం, కోదాడ, సూర్యాపేట ,మహబూబాబాద్‌లో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించినట్లు ఫైర్ డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, కోదాడలో చాలామందిని ఫైర్ సిబ్బంది రక్షించినట్లు తెలిపారు. నిన్న 670 మందిని ఫైర్ సేఫ్టీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు రక్షించాయి. ఇవాళ ఖమ్మంలో వెయ్యి మందిని, మహబూబాబాద్, సూర్యాపేటలో 350 మందిని ఫైర్ సేఫ్టీ అధికారులు రక్షించారు.
రక్షించిన వారందరినీ సురక్షిత ప్రాంతాలకు ఫైర్ సిబ్బంది తరలించారు. ఖమ్మంలో ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 800 మందిని ఫైర్ సిబ్బంది కాపాడారు. ప్రకాష్ నగర్, సాయి నగర్‌లోనే బాధితులు ఎక్కువగా చిక్కుకుపోయినట్లు ఫైర్ డీజీ వెల్లడించారు. బోట్ల సాయంతో వరద బాధితులను ఫైర్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖమ్మంలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కాలేదని ఫైర్ డీజీ నాగి రెడ్డి పేర్కొన్నారు.