Leading News Portal in Telugu

Revanth Reddy Chitchat: ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటా.. రేవంత్‌ రెడ్డి చిట్ చాట్


  • ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామన్న సీఎం రేవంత్‌ రెడ్డి ..

  • గుండె కరిగిపోయే దృశ్యాలు-మనసు చెదిరిపోయే కష్టాలు సీఎం చిట్ చాట్..
Revanth Reddy Chitchat: ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటా.. రేవంత్‌ రెడ్డి చిట్ చాట్

Revanth Reddy Chitchat: ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. గుండె కరిగిపోయే దృశ్యాలు… మనసు చెదిరిపోయే కష్టాలు…స్వయంగా చూశానని తెలిపారు. బాధితుల మొఖాలల్లో.. ఒకవైపు తీరని ఆవేదన… మరోవైపు “అన్నా” వచ్చాడన్న భరోసా. వీళ్ల కష్టం తీర్చడానికి… కన్నీళ్లు తుడవడానికి…ఎంతటి సాయమైనా..చేయడానికి సర్కారు సిద్ధని తెలిపారు. తెలంగాణ ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. ఖమ్మంలో కూడా ఆక్రమణల వల్ల వరదలు వచ్చాయని తెలిపారు. గతంలో గొలుసు కట్టు చెరువులు వుండేయన్నారు. మున్నేరు రిటైర్నింగ్ వాల్ ఎత్తు పెంచడం అనేది ఇంజనీర్ల తో మాట్లాడిచూస్తామన్నారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి అవసరం అనుకుంటే. ఆక్రమణలు తొలగిస్తామన్నారు. మిషన్ కాకతీయ అనేదే కమీషన్ కాకతీయ అని దివంగత నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలో చెప్పారని తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పాటిష్టం చేశాం అన్నారు .. మరి గతంలో తెగని చెరువులు ,ఇప్పుడు ఎందుకు తెగుతున్నాయన్నారు. 42 సెంటీమీటర్ల వర్షం అంతే ఇది అత్యధికంగా పడింది.. 75 సంవత్సరాలలో ఇంత వర్షం పడలేదన్నారు.

Read also: Damodar Raja Narasimha: గాంధీ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ..

అంత విపత్తు జరిగిన ప్రాణ నష్టాన్ని తగ్గించం అంటే.. అది ప్రభుత్వ ముందు చూపే అన్నారు. వరదలపై హరీష్ మాట్లాడుతున్నారు. ముందు మీ నాయకుడు పువ్వాడ అజయ్ ఆక్రమించిన హాస్పిటల్ లో కాలువల విషయంలో హరీష్ రావు నిలబడి తొలగించమని చెప్పమనండి అన్నారు. ఆదర్శంగా వుండాలన్నారు. కేంద్రానికి లేఖ రాసాము.. వారి స్పందన రావాలని తెలిపారు. రాష్ట్రం మాత్రం మరణించిన వారికి 5 లక్షలు సహాయం ప్రకటిస్తున్నామన్నారు. వరదల సహాయంతో మా మంత్రులు ప్రజలతో వుంటున్నారని, మమ్ములను అడుగుతారు నిలదీస్తారన్నారు.. వారు మా వారే మాకు ఓటు వేసి గెలిపించారు. కానీ ఫాం హౌస్ లో పడుకున్న వారిని అడుగుతార అని అన్నారు. ఇటువంటి విపత్తు సమయంలో గతంలో ముఖ్యమంత్రులు హామీలు ఇచ్చారు కానీ.. అమలు చేయలేదు. మాది చేతల ప్రభుత్వం.. గత ప్రభుత్వ హామీలు కూడా మేమే ఇచ్చామన్నారు. రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా విపత్తు నిర్వహణ సంస్థ సిద్ధం చేస్తున్నామన్నారు. ముందు భాదితులకు రూ 10 వేల రూపాయలు తక్షణం అందించమని చెప్పామన్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. వరద ప్రభావిత ప్రాంతాలు, పొలాలు, రహదారులను పరిశీలించనున్నారు. వరదలో మృతి చెందిన శాస్త్రవేత్త అశ్విని కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్‌.. నేడు, రేపు మరో 20 రైళ్ళు రద్దు..