Leading News Portal in Telugu

సీఎం రిలీఫ్ ఫండ్ కు ఎన్ఆర్ఐ రూ. కోటి విరాళం | nri donate rs crore for cm relief fund| vijayawada| flood| situation| help


posted on Sep 3, 2024 11:09AM

ఆంధప్రదేశ్ లో భారీ ఎత్తున సంభవించిన వరదలతో ముంపు ప్రాంతాల ప్రజల సహాయ పునరావాస కార్యక్రమాల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. అందులో భాగంగా ఎన్ఆర్ఐ గుత్తికొండ శ్రీనివాస్ వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయానికి తన వంతుగా కోటి రూపాయలు విరాళం ఇచ్చారు.

ఇందుకు సంబంధించి కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి అందించారు.  వరద బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తనను ఎంతో బాధకు గురి చేశాయని, వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాలుపంచుకునేందుకు విరాళం అందించానని గుత్తికొండ శ్రీనివాస్ ఈ సందర్భంగా చెప్పారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్విరామంగా కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

చెక్కును అందుకున్న చంద్రబాబు    శ్రీనివాస్ ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువగా విరాళాలు ఇస్తారని, గతంలోనూ కాణిపాకం దేవాలయాభివృద్ధికి రూ.18 కోట్లు అందజేశారని, ప్రస్తుత విపత్తు సమయంలో ముందుకొచ్చి విరాళం అందించినందుకుగాను శ్రీనివాస్ ను చంద్రబాబు  అభినందించారు.