posted on Sep 4, 2024 10:57AM
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో 3వేల కి.మీ.కు పైగా రహదారులు దెబ్బతిన్నాయి. 149 పశువులు, 59,848 కోళ్లు మరణించాయి. వరద బాధితులకు ఆహార పదార్థాలను అందించేందుకు ఆరు హెలికాప్టర్లను ప్రభుత్వం వినియోగించింది. వదర సహాయ, పునరావాల కార్యక్రమాలలో 48 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమై ఉన్నాయి.
ఇలా ఉండగా ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదీ వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఇక్కడ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో సమానంగా ఉంది. వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.5 అడుగులు ఉంది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉప సంహరించుకున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారిని అన్నివిధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సర్వ శక్తులూ ఒడ్డుతోంది.
అదే సమయంలో వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ కు భారీగా విరాళాలు అందుతున్నాయి. వరద బాధితులను ఆదుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్ కు రాజకీయ, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారూ తమ తమ స్థాయికి తగ్గట్టుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇస్తున్నారు. వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. అలాగే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ను ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ.50 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. అలాగు వైజయంతీ మూవీస్ సంస్థ సీఎం రిలీఫ్ ఫండ్ కుపాతిక లక్షల విరాళాన్ని ప్రకటించగా, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, ఎస్. నాగవంశీ కూడా సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. ఇక యువ హీరో జోన్నలగడ్డ సిద్ధు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు 15 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. మరో యువహీరో విశ్వక్షేన్ 5లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఇక హెరిటేజ్ తరఫున నారా భువనేశ్వరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. అలాగే తెలంగాణలో వరద బాధితుల కోసం తెలంగాణకు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.