Leading News Portal in Telugu

Bhadradri Kothagudem: భద్రాద్రి, ములుగు జిల్లాల సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌..


  • ద్రాద్రి
  • ములుగు జిల్లాల సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌..

  • దామెర వద్ద పోలీసులు
  • మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు..

  • కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి..
Bhadradri Kothagudem: భద్రాద్రి, ములుగు జిల్లాల సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌..

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుపాకీ మోత మోగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. కరకగూడెం అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. దీంతో సరిహద్దు జిల్లాల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు మరణించారు.

Read also: Heavy Rain Alert: నేడు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ నెల 8 వరకు భారీ వర్షాలు

దంతెవాడ జిల్లాలోని లోహగావ్‌లోని అండ్రి గ్రామం, పురంగెల్ అడవుల్లో 40 మంది వరకు మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందుకున్న సీఆర్‌పీఎఫ్, డీఆర్‌జీ జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అనంతరం ఘటనాస్థలిని బలగాలు పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా 9 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గుర్తించారు. ఇవి పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ-2, సౌత్ బస్తర్‌కు చెందినవిగా భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఎస్‌ఎల్‌ఆర్‌, 303 రైఫిల్‌, 12 బోర్‌ రైఫిల్‌, 315 బోర్గన్‌, బారెల్‌ గన్‌ లాంఛర్లు ఒక్కొక్కటి చొప్పున దొరికాయి.
The GOAT Review: విజయ్ ‘ది గోట్’ రివ్యూ.. హిట్ కొట్టాడా? లేదా?