Leading News Portal in Telugu

PM Modi: సింగపూర్‌ పార్లమెంట్ హౌస్‌లో లారెన్స్ వాంగ్‌తో ప్రధాని మోడీ భేటీ..


PM Modi In Singapore: సింగపూర్‌ లోని పార్లమెంట్ హౌస్‌లో లారెన్స్ వాంగ్‌ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. సింగపూర్ చేరుకున్న తర్వాత, బుధవారం నాడు మోడీ మాట్లాడుతూ.., నేను సింగపూర్ చేరుకున్నాను. భారత్ – సింగపూర్ దేశాల స్నేహాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో జరిగే అనేక సమావేశాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. భారతదేశంలో జరుగుతున్న సంస్కరణలు, మన యువశక్తి ప్రతిభ మన దేశాన్ని ఒక ఆదర్శ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చింది. మేము సన్నిహిత సాంస్కృతిక సంబంధాల గురించి కూడా చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Sukanya Samriddhi Yojana: బిగ్ అప్డేట్.. సుకన్య సమృద్ధి యోజనలో రూల్స్ చేంజ్..

సింగపూర్‌ లోని వ్యాపార ప్రముఖులను కూడా ప్రధాని మోడీ కలుస్తారని, దేశంలోని సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులతో సంభాషిస్తారని సమాచారం. అధికారుల ప్రకారం, ఈ పర్యటన సింగపూర్, భారతదేశం దేశాల సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ మధ్య సమన్వయాన్ని పెంచుతుంది. సెమీకండక్టర్ల తయారీ కేంద్రాన్ని కూడా ఇరు దేశాల ప్రధానులు సందర్శించనున్నారు. ప్రస్తుతం మోడీ సింగపూర్‌ పార్లమెంట్ హౌస్‌లో ఉన్న సమయంలో వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

The Greatest Of All Time: ‘ది గోట్‌’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. రికార్డ్ ధర!