ఆంధ్రప్రదేశ్ లో వరద ప్రభావిత జిల్లాలలో కేంద్ర బృందం పర్యటన | central team visit flood effected areas| loss| estimate| victims
posted on Sep 5, 2024 11:06AM
ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటిస్తోంది.ఈ బృందానికి కేంద్ర హోంశాక అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వం వహిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టం అంచనాకు ఈ బృందం పర్యటిస్తున్నది.
నేరుగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించడంతో పాటు వరద బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనుంది. పర్యటనకు ముందు కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్షించింది. ఆ సందర్భంగా భారీ వర్షాలు, వరదల పరిస్థితిని అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.