Leading News Portal in Telugu

Lucknow: కదులుతున్న అంబులెన్స్‌లో మహిళపై అత్యాచార యత్నం..


  • కదులుతున్న అంబులెన్స్‌లో మహిళపై అత్యాచారం

  • అంబులెన్స్‌ సహాయకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

  • డ్రైవర్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు.
Lucknow: కదులుతున్న అంబులెన్స్‌లో మహిళపై అత్యాచార యత్నం..

కదులుతున్న అంబులెన్స్‌లో మహిళపై అత్యాచారం చేసి దోపిడీకి ప్రయత్నించిన కేసులో అంబులెన్స్‌ సహాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో అంబులెన్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. డ్రైవర్ ఆచూకీ కోసం పోలీసులు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. అయోధ్యలోని కున్హర్‌గంజ్‌లో నివాసం ఉంటున్న రిషబ్ సింగ్‌ను అంబులెన్స్‌లో సహాయకుడిగా ఉన్నాడు. కాగా.. నిందితుడిని నిఘా సహాయంతో అరెస్టు చేసినట్లు ఏసీపీ ఘాజీపూర్ అనిద్ర్య విక్రమ్ సింగ్ తెలిపారు.

కాగా అంబులెన్స్ సహాయకుడిని విచారించగా.. అంబులెన్స్ డ్రైవర్ గా ఉన్న సూరజ్ తివారీ అసలు నిందితుడని చెప్పాడు. డ్రైవర్ సూరజ్ తివారీ మద్యం మత్తులో ఉన్నాడని, మద్యం మత్తులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని అతను చెప్పాడు.

అయితే.. డ్రైవర్ కోసం పోలీసులు చాలా చోట్ల వెతికినా ఇంకా ఆచూకీ లభించలేదు. అయితే.. 200 కిలోమీటర్ల ప్రయాణానికి రూ. 9వేలు చెల్లించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. అంతేకాకుండా.. తన వద్ద నుంచి మరికొంత డబ్బు తీసుకున్నట్లు చెప్పింది. ఆ తర్వాత బాధిత మహిళ నుంచి రూ.10వేలు, మంగళసూత్రం, చీలమండలు, ఇతర పత్రాలను డ్రైవర్ లాక్కొని పారిపోయినట్లు బాధిత మహిళ పేర్కొంది.