Leading News Portal in Telugu

Floods In Vijayawada: హృదయవిదారక దృశ్యాలు.. కుక్కలకు ఆహారం వేస్తూ వాటి ఆకలి తీరుస్తున్న యువత..


  • విజయవాడ వరద పెంపుడు జంతువుల యజమానులకు బాధను మిగిల్చింది.
  • హాఠాత్తుగా వచ్చిన వరద ఇళ్లలో ఉన్న పెంపుడు జంతువులు.. ముఖ్యంగా కుక్కలను మింగేసింది.
Floods In Vijayawada: హృదయవిదారక దృశ్యాలు.. కుక్కలకు ఆహారం వేస్తూ వాటి ఆకలి తీరుస్తున్న యువత..

Floods In Vijayawada: విజయవాడ వరద పెంపుడు జంతువుల యజమానులకు బాధను మిగిల్చింది. హాఠాత్తుగా వచ్చిన వరద ఇళ్లలో ఉన్న పెంపుడు జంతువులు.. ముఖ్యంగా కుక్కలను మింగేసింది. కొన్ని వరదకు కొట్టుకుపోయి అక్కడక్కడ చిక్కుకుపోయాయి. వాన తెరిపివ్వడం, వరద తగ్గుముఖం పడుతుండటంతో ఓ పక్క ఇళ్లు సర్దుకుంటూనే ఇంకోపక్క కనిపించకుండాపోయిన తమ పెంపుడు కుక్కల కోసం వెతుక్కుంటున్నారు యజమానులు. నాలుగైదు రోజుల తర్వాత కనిపించిన యజమానులను చూసి ఆ కుక్కలు, వాటిని చూసుకున్న యజమానుల ఆనందం చెప్పతరం కావడం లేదు. ఇది ఒక కథ అయితే… ఇంకోవైపు వరదల విలయంలో జనజీవన అస్తవ్యస్థం కావడంతో ఊరకుక్కలకు తింటానికి తిండి కరువైంది. జనమే… ఇంత ముద్ద దొరుకుతుందా అని ఎదురు చూసే సమయం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో కొంత మంది రోడ్ల పక్కన కనిపించిన కుక్కలకు ఆహారం వేస్తూ వాటి ఆకలి తీరుస్తున్నారు.

Rammohan Naidu: మరో రెండేళ్లలో భోగాపురం ఎయిర్పోర్టును అందుబాటులోకి తీసుకొస్తాం..

ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యంత్రం, విజయవాడ వరదల సంబంధించి అనేక సహాయక చర్యలను నిరంతరం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులతో పాటు మంత్రులు కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో చర్యలను చేపడుతూ సహయపడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద సంభవించిన రోజు నుంచి విజయవాడలోనే ఉంటూ అధికారులతో పనులను చేపట్టేలా చేస్తున్నారు.