- విజయవాడలో వరదలు మిగిల్చిన నష్టంపై అంచనాకు సిద్ధమైన ప్రభుత్వం..
-
సోమవారం నుంచి మూడు రోజుల పాటు వరద నష్టం అంచనా.. -
వెల్లడించిన రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా.. -
ఈ సమయంలో బాధితులు ఇళ్లలో ఉంటే బెటర్.. -
పూర్తిస్థాయి వివరాల నమోదుకు అవకాశం ఉంటుందన్న సిసోడియా..

Vijayawada Floods: విజయవాడను బుడమేరు ముంచేసింది.. ఇప్పటికీ విజయవాడ పూర్తిస్థాయిలో తేరుకోలేదు.. అయితే.. విజయవాడలో వరదలు మిగిల్చిన నష్టంపై అంచనా వేసేందుకు సిద్ధం అవుతోంది ప్రభుత్వం.. సోమవారం నుంచి మూడు రోజుల పాటు వరద నష్టం అంచనా వేస్తామని తెలిపారు ఏపీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా.. అయితే, ఈ సమయంలో బాధితులు ఇళ్లలో ఉంటే పూర్తిస్థాయి వివరాల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు.. 32 వార్డుల్లో రెండు లక్షల ఇళ్లలో వరద నష్టం ఎల్లుండి నుంచి లెక్కించనున్నట్టు వెల్లడించిన ఆయన.. ఈ వరద నష్టం అంచనాలో 149 మంది తహసీల్దార్లు పాల్గొంటారని తెలిపారు.. 32 వార్డులలో 149 సచివాలయాల పరిధిలో రెండు లక్షల నివాసాలలో నష్టం గణన ఉంటుంది.. దీనిపై ఆదివారం ఆ టీమ్లకు విజయవాడలో ఒక రోజు శిక్షణ ఇస్తాం అన్నారు.. ప్రతి వార్డుకు ఒక జిల్లా స్ధాయి అధికారి నేతృత్వం వహిస్తారు.. ప్రతి రెండు వార్డులకు ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు.. ఒక వార్డు లేదా గ్రామ సచివాలయానికి 10 గణన బృందాలు ఉంటాయి.. కమర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ ల నష్టం గణన కోసం 200 బృందాలు రంగంలోకి దిగుతాయని పేర్కొన్నారు ఏపీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా..