- ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా జై షా
- స్పందించిన పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నక్వీ
- పాక్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ

PCB Chairman Mohsin Naqvi About Jay Shah: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా రావడం తమకేమీ ఆందోళన కలిగించడం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మోసిన్ నక్వీ అన్నారు. జై షాతో తాము టచ్‌లోనే ఉన్నామని తెలిపారు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ పాక్‌లోనే జరగనుందని మోసిన్ స్పష్టం చేశారు. ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ అంశంపై అధికారికంగా స్పందించని నక్వీ.. తాజాగా ఓ కార్యక్రమంలో షాకు విషెష్ చెప్పారు.
తాజాగా మోసిన్ నక్వీ మాట్లాడుతూ… ‘బీసీసీఐ కార్యదర్శి జై షా మేం టచ్‌లోనే ఉన్నాం. ఐసీసీ ఛైర్మన్‌గా అతడు రావడం పట్ల మాకు ఆందోళన ఏమీ లేదు. ఏసీసీ మీటింగ్ సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరగనుంది. నేను మీటింగ్‌కు హాజరు కాను కానీ.. పీసీబీ నుంచి సల్మాన్ నసిర్ వెళ్తారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త అధ్యక్షుడికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకొనే అవకాశం ఉంది. ఏదేమైనా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాక్‌లోనే జరగనుంది. ట్రోఫీలో ఆడే అన్ని జట్లతో పీసీబీ సంప్రదింపులు చేస్తోంది’ అని చెప్పారు. టోర్నీని పాక్‌లో నిర్వహిస్తే తమ జట్టును పంపమని, తటస్థ వేదికపై మ్యాచులు నిర్వహిచాలని బీసీసీఐ పట్టుబడుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులు పాక్ వద్ద ఉన్న విషయం తెలిసిందే.