Leading News Portal in Telugu

VC Sajjanar Tweet: వెర్రి చేష్టలు అవసరమా!? ఏపీ పోలీసులను ట్యాగ్ చేస్తూ సజ్జనార్‌ ట్వీట్ వైరల్‌..


  • ఏపీ పోలీసులను ట్యాగ్ చేస్తూ సజ్జనార్‌ ట్వీట్ వైరల్‌..

  • సోషల్ మీడియాలో పాపులారిటీ రావాలంటే ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!?..
VC Sajjanar Tweet: వెర్రి చేష్టలు అవసరమా!? ఏపీ పోలీసులను ట్యాగ్ చేస్తూ సజ్జనార్‌ ట్వీట్ వైరల్‌..

VC Sajjanar Tweet: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు ఇష్టానుసారంగా రీళ్లు చేస్తున్నారు. ఓ యువకుడు వ్యూస్‌ కోసం వెకిరి చేష్టలు చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు ఫాలో అవుతున్న వ్యక్తి కోరిక మేరకు ఆ యువకుడు సవాలు చేశాడు. ఆ సవాల్‌ ఏంటంటే.. ఆర్టీసీ బస్సును నడిరోడ్డుపై ఆపి బస్సులో ఎక్కి ఆతరువాత కిందికి దిగి పారిపోవాలని యూజర్‌ కోరాడు. ఆ యువకుడు సరే అలాగే డేర్‌ చేస్తా అంటూ సవాల్ విసిరారు. అతను రోడ్డు మీదకు వెళ్ళాడు. అప్పుడే APSRTC పల్లె వెలుగు బస్సు వచ్చింది. బస్సును ఆపడానికి అతను చేయి ఊపాడు. దీంతో సదరు వ్యక్తి బస్సు ఎక్కుతాడని భావించిన బస్సు డ్రైవర్ బస్సును ఆపాడు.

Read also:Khairatabad Ganesh 2024: గంట గంటకూ పెరుగుతున్న ఖైరతాబాద్ గణేష్ భక్తుల రద్దీ..

అయితే ఆ యువకుడు ఆ బస్సును ఎక్కి అటు ఇటు చూసుకుంటూ బస్సు కదులుతున్నా పట్టించుకోకుండా.. కిందకు దిగి వెనక్కి పరుగెత్తాడు. ఈ తతంగమంతా వీడియో తీసి.. తన ఇస్టా ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఆ తర్వాత సవాల్ చేసి గెలిచానని చెప్పాడు. ఆ తరువాత నన్ను ఫాలో అవ్వండి అంటూ ట్యాగ్‌ లైన్‌ చెప్పి వీడియో ముగించాడు. ఈ వీడియోను చూసి స్పందించిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సోషల్‌ మీడియా వేదికగా ఫైర్‌ అయ్యారు. సోషల్ మీడియాలో పాపులారిటీ రావాలంటే ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!? ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందనే సోయి కూడా లేకుండా కొందరు ఈ వికృత చేస్టలు చేస్తూ ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. లైక్‌లు, కామెంట్‌ల కోసం పిచ్చి పనులు చేయడం మానుకోండని సలహా ఇచ్చారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి.. జీవితంలో ఉన్నతంగా ఎదగండి అని ఏపీ పోలీసులకు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు. మరి దీనిపై ఏపీ పోలీసులు ఎలా స్పందిస్తారు? అని ప్రశ్నార్థకంగా మారింది.
Kishan Reddy: మున్నేరు వరద బాధితులకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేసిన కిషన్ రెడ్డి..