Leading News Portal in Telugu

MP: ఒకే అమ్మాయిని ప్రేమించిన అన్నదమ్ములు.. ఆమె కోరికలు తీర్చడానికి ఏం చేశారో తెలుసా..?


  • ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు సోదరులు

  • తమ ప్రియురాలి కోసం దొంగలుగా మారిన అన్నదమ్ములు

  • మేకప్.. బట్టలు.. ఖరీదైన అభిరుచులను నెరవేర్చడం కోసం దొంగ అవతారం

  • మధ్యప్రదేశ్లోని గ్వాలియర్‌లో ఘటన

  • దొంగతనం ఆరోపణలపై సోదరులను అరెస్ట్ చేసిన పోలీసులు.
MP: ఒకే అమ్మాయిని ప్రేమించిన అన్నదమ్ములు.. ఆమె కోరికలు తీర్చడానికి ఏం చేశారో తెలుసా..?

ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు సోదరులు తమ ప్రియురాలి కోసం దొంగలుగా మారారు. తన మేకప్, బట్టలు, ఖరీదైన అభిరుచులను నెరవేర్చడం కోసం దొంగ అవతారమెత్తారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. దొంగతనం ఆరోపణలపై ఈ సోదరులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన అన్నదమ్ములు.. మెహగావ్ జిల్లా భింద్‌లో నివసించేవారు. వీరి వద్ద నుంచి రూ.2.75 లక్షల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా.. హస్తినాపురం పోలీస్ స్టేషన్‌లో ఆగస్టు 31న మునేష్ అనే వ్యక్తి రూ.16 వేల నగదు, బంగారు, వెండి ఆభరణాలు, మూడు మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజు రాత్రి ఉటిల పోలీస్ స్టేషన్‌లోని సౌసా గ్రామంలో ఓ ఇంటి తాళం పగులగొట్టి మొబైల్ ఫోన్, నగదు చోరీకి గురైన సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో.. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించారు.

హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి, ఇన్‌ఫార్మర్, సైబర్ సెల్ సహాయంతో.. మెహగావ్ జిల్లా భింద్‌కు చెందిన ఇద్దరు సోదరులు రవి ధనుక్, విశాల్ ధనుక్‌లగా గుర్తించారు. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. వారు హస్తినాపూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఒక దొంగతనం, ఉటిల పోలీస్ స్టేషన్‌ పరిధిలో రెండు దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. దీంతో.. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.