Leading News Portal in Telugu

Indian Hockey Team: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మెరిసిన భారత హాకీ జట్టు.. జపాన్‌పై విజయం


  • పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో మెరిసిన భారత్ హాకీ జట్టు

  • జపాన్‌పై డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్.. 5-1 తేడాతో విజయం

  • ఆల్ రౌండ్ ప్రదర్శనను కనబరిచిన భారత్.
Indian Hockey Team: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మెరిసిన భారత హాకీ జట్టు.. జపాన్‌పై విజయం

సోమవారం జరిగిన పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో జపాన్‌పై డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్.. 5-1 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనను కనబరిచింది. సుఖ్‌జీత్ కీలక సమయంలో రెండు గోల్స్ చేసి విజయాన్ని అందించాడు. మరోవైపు.. అభిషేక్ మూడో గోల్స్ చేయగా.. సంజయ్‌, ఉత్తమ్‌ సింగ్‌ అద్భత ప్రదర్శన కనబరిచారు. జపాన్ 41వ నిమిషంలో మట్సుమోటో కజుమాసా గోల్ చేసినప్పటికీ భారత్ ను ఓడించలేకపోయాడు. మరోవైపు.. భారత్‌ తన తొలి మ్యాచ్‌లో చైనాను 3-0తో ఓడించింది. కాగా.. హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని జట్టు బుధవారం చివరి ఎడిషన్ రన్నరప్ మలేషియాతో తలపడనుంది.

మ్యాచ్‌ రెండో నిమిషంలోనే సుఖ్‌జీత్‌ చేసిన అద్భుతమైన ఫీల్డ్‌ గోల్‌తో భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత.. అభిషేక్ చేసిన గోల్ వల్ల భారత్ ఆధిక్యాన్ని 2-0కి పెంచింది. రెండో క్వార్టర్‌లోనూ భారత్‌ అటాక్‌ కొనసాగింది. 17వ నిమిషంలో సంజయ్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. హాఫ్ టైమ్‌లో భారత్ 3-0 ఆధిక్యంతో ఉండగా.. సెకండాఫ్లో జపాన్ పునరాగమనం చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. 60వ నిమిషంలో సుఖ్‌జీత్ మరో గోల్ చేసి మ్యాచ్‌ను అద్భుతంగా ముగించాడు. దీంతో.. భారత్ 5-1 తేడాతో గెలుపొందింది.