Leading News Portal in Telugu

Kamala Harris: తెలుగు సినిమా పాటతో కమలా హారిస్ ఎన్నికల ప్రచారం


  • తెలుగు సినిమా పాటతో కమలా హారిస్ ఎన్నికల ప్రచారం

  • దక్షిణాసియా ఓటర్లను ఆకట్టుకునేందుకు వీడియో విడుదల
Kamala Harris: తెలుగు సినిమా పాటతో కమలా హారిస్ ఎన్నికల ప్రచారం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు సినిమాలోని పాట మార్మోగుతుంది. ఏడాది చివరిలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ బరిలో ఉన్నారు. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక కమలా హారిస్ వ్యూహాత్మకంగా ప్రచారంలోకి దూసుకెళ్తున్నారు. దక్షిణాసియా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె సరికొత్త వ్యూహం రచించారు. ఆమె ప్రచారం బృందం తెలుగు పాటతో రూపొందించిన ఓ వీడియోను విడుదల చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాట హిందీ వెర్షన్‌ మ్యూజిక్ ట్రాక్‌ ఆధారంగా కమలా హారిస్ ప్రచార గీతాన్ని రూపొందించారు. వీడియోను ఇండియన్-అమెరికన్ వ్యవస్థాపకుడు అజయ్ భూటోరియా సోషల్ మీడియాలో విడుదల చేశారు.

Nachonacho

వీడియోలో భారతీయ సంతతికి చెందిన పలువురు నాయకులు కనిపించారు. కమలా హారిస్‌కు ఓటు వేయాలని వారంతా కోరారు. కమలకు ఓటు వేయాలని తెలుగు భాషలో కూడా డెమొక్రాటిక్ పార్టీ నేతలు కోరారు. కాగా దక్షిణాసియాకు చెందినవారు అమెరికాలో పెద్ద సంఖ్యలో నివసిస్తు్న్నారు. మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, జార్జియా, నెవాడా, అరిజోనా వంటి కీలక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. దాదాపు ఐదు మిలియన్ల దక్షిణాసియా ఓటర్లు ఉంటారని అంచనా ఉంది. వారిని ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కమలకు మద్దతుగా కొత్త మ్యూజిక్ వీడియో ‘నాచో నాచో’ను విడుదల చేస్తున్నందుకు సంతోషిస్తున్నామని అజయ్ జైన్ భుటోరియా తెలిపారు.

ఇది కూడా చదవండి: Amanatullah Khan: మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యేకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..