Leading News Portal in Telugu

High Tension in Vizag: స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన.. విశాఖలో టెన్షన్ టెన్షన్‌..


  • విశాఖపట్నంలో కార్మికుల ఆందోళనతో ఉద్రిక్తత..

  • రోడ్లను దిగ్బంధించిన స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు..

  • నిరసనకారులు.. పోలీసుల మధ్య వాగ్వాదం..
High Tension in Vizag: స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన.. విశాఖలో టెన్షన్ టెన్షన్‌..

High Tension in Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా కీలక చర్యలకు సన్నద్ధమవుతోంది. ఇవాళ, రేపు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కీలక సమావేశ ఏర్పాటు చేసింది. హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు.. మేనేజ్మెంట్ మీటింగ్ కంటే ముందు అనూహ్యమైన నిర్ణయం వెలువడింది. స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్‌ను సెలవుపై వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో కొత్త సీఎండీ నియామకం జరిగే వరకు డైరెక్టర్ ఆపరేషన్‌కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రాష్ట్రవ్యాప్త ధర్నాలకు పిలుపునిచ్చింది. స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరం దగ్గర వందల మంది కార్మికులు రహదారుల దిగ్బంధనం చేయనున్నారు. రెండు గంటలకు పైగా ప్రధాని రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయాలని పోరాట కమిటీ పిలిపిచ్చింది.

ఇక, స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని., ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం సహకరించాలని, సొంత గనులు కేటాయించాలని పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. గడచిన మూడున్నర సంవత్సరాలుగా ఈ పోరాటం కొనసాగుతోంది. అయితే, విశాఖపట్నంలో కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.. రోడ్లను దిగ్బంధించిన స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు ఆందోళనకు దిగిరు.. అయితే.. నిరసనకారులకు.. పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. కార్మిక నేతలను ఈడ్చుకెళ్లి వాహనం ఎక్కించారు పోలీసులు.. స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది..