- మచిలీపట్నంలో బ్యానర్ విషయంలో టీడీపీ.. జనసేన వర్గాల మధ్య విభేదాలు
-
తారస్థాయికి బ్యానర్ గొడవ -
జనసేన కార్యకర్త యర్రంశెట్టి నాని మరియు అతని బావపై దాడి -
దాడిలో గాయపడ్డ శాయన శ్రీనివాసరావు -
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చిలకలపూడి పోలీసులు.

టీడీపీ-జనసేన కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అధినేతలు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పాలన చేస్తుంటే.. కింది స్థాయి నేతలు, కార్యకర్తలు పార్టీని దిగజారుస్తున్నారు. తాజాగా.. కృష్ణా జిల్లాలో అధికార కూటమి పార్టీలో వర్గ విభేదాలు తలెత్తాయి. మచిలీపట్నంలో బ్యానర్ విషయంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో.. బ్యానర్ గొడవ తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో.. జనసేన కార్యకర్త యర్రంశెట్టి నాని, అతని బావపై టీడీపీ కార్యకర్త దాడి చేశారు. ఈ దాడిలో శాయన శ్రీనివాసరావు గాయపడ్డారు.
నాయర్ బడ్డి సెంటర్ బాలాజీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు, యర్రంశెట్టి నానిపై మద్యం బాటిళ్లు గ్రైండర్తో కొట్టడంతో శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా.. అపార్ట్మెంట్లోని రెండు ఎల్ సి డి టీవీలు, ఫ్రిజ్, గ్రైండర్, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వారిని తీవ్రంగా కొట్టిన అనంతరం ఇద్దరితో కాళ్ళు పట్టించి వీడియోలు చిత్రీకరించారని స్థానికులు చెబుతున్నారు. కాగా.. తీవ్రంగా గాయపడిన సాయన శ్రీనివాసరావును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం.. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.