Leading News Portal in Telugu

Fake Doctor: వైద్యుడి అవతారం ఎత్తిన ల్యాబ్ టెక్నీషియన్..!


  • ఉప్పల్ లో ఓ వ్యక్తి ల్యాబ్ టెక్నీషియ న్ కోర్స్ చేసి.. వైద్యుడిగా అవతారం..

  • ఎంబిబిఎస్ డాక్టర్ పేరుతో వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతి..

  • నకిలీ వైద్యుడిని ఎస్ ఓటి పట్టుకొని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.
Fake Doctor: వైద్యుడి అవతారం ఎత్తిన ల్యాబ్ టెక్నీషియన్..!

Fake Doctor: ఉప్పల్ లో ఓ వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి.. వైద్యుడిగా అవతారమెత్తి.. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఓ నకిలీ వైద్యుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎంబిబిఎస్ డాక్టర్ పేరుతో వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతి పొంది, అర్హత లేకున్నా ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్న నకిలీ వైద్యుడిని ఎస్ ఓటి పట్టుకొని ఉప్పల్ పోలీసులకు అప్పగించిన ఘటన సంచలనంగా మారింది.

Read also: CM Revanth Reddy: ప్రజాభవన్ లో 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి..

పీర్జాదిగూడలోని బాలాజీ నగర్ లో నివసిస్తున్న చౌటుప్పల్ లింగోజిగూడెం గ్రామానికి చెందిన కొయ్యలగూడెం బిక్షపతి ఉప్పల్ అన్నపూర్ణ కాలనీ మండే మార్కెట్ లో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నాడు. ఎంబిబిఎస్ డాక్టర్ పేరుతో పర్మిషన్ తీసుకొని మణికంఠ పాలీ క్లినిక్ గత ఐదేళ్లుగా నడుపుతున్నాడు. ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి వైద్యుడు అవతారం ఎత్తాడు. అర్హత లేకున్నా అమాయక ప్రజలను నమ్మించి మిడిమిడి జ్ఞానంతో వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడు తున్నాడు. ఎస్ఎస్సి వరకు మాత్రమే చదివిన అతడు వైద్యుడిగా వైద్య పరీక్షలు చేస్తూ ప్రిస్క్రిప్షన్ రాస్తూ పరిసర ప్రాంతాల అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నాడని అందిన సమాచారం మేరకు ఎస్ ఓటి ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఎస్ఐ మల్లేష్ సిబ్బందితో సోమవారం క్లినిక్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నకిలీ వైద్యుడు బిక్షపతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు నిమిత్తం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.
Big Breaking: హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనానికి అనుమతిలేదు.. ట్యాంక్‌బండ్‌పై ఫ్లెక్సీలు..