Leading News Portal in Telugu

Indian Air Force: ఎయిర్‌ఫోర్స్ మహిళా అధికారిపై వింగ్ కమాండర్‌ అత్యాచారం.. ఓరల్ సె*క్స్‌కి బలవంతం..


  • మహిళా అధికారిపై వింగ్ కమాండర్ అత్యాచారం..

  • ఇంటర్నెల్ ఎంక్వైరీకి ఆదేశించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..

  • 2023 న్యూ ఇయర్ పార్టీలో అత్యాచారం చేశాడని ఆరోపించిన మహిళ అధికారి..
Indian Air Force: ఎయిర్‌ఫోర్స్ మహిళా అధికారిపై వింగ్ కమాండర్‌ అత్యాచారం.. ఓరల్ సె*క్స్‌కి బలవంతం..

Indian Air Force: జమ్మూ కాశ్మీర్‌లోని వైమానికి దళ స్టేషన్‌లో వింగ్ కమాండర్‌గా పనిచేసే అధికారి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ ఆరోపించడం సంచలనంగా మారింది. అత్యాచారం, మానసిక వేధింపులు, నిరంతర వేధింపులకు పాల్పడినట్లు మహిళా అధికారి ఆరోపించడంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) ఇంటర్నల్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వింగ్ కమాండర్‌పై మహిళా అధికారి ఫిర్యాదు చేయడంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

వింగ్ కమాండర్‌పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 376(2) కింద బుద్గామ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది, ఇది అధికారిక హోదాలో ఉన్న వ్యక్తులు చేసిన తీవ్రమై అత్యాచారానికి సంబంధించింది. మహిళా అధికారి ఫిర్యాదు ప్రకారం.. డిసెంబర్ 31, 2023 రాత్రి ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో అధికారి తన గదిలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. 2021లో జరిగిన ఇలాంటి ఘటనలో ఐఏఎఫ్ మహిళా పైలట్ తన ఫ్లైట్ కమాండర్‌ తనని లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ జమ్మూకాశ్మీర్ హైకోర్టును ఆశ్రయించారు.

గత రెండేళ్లుగా తనను వేధింపుకలు గురిచేస్తున్నాడని ఫ్లయింగ్ ఆఫీసర్ తన ఫిర్యాదులో పేర్కొంది. డిసెంబర్ 31, 2023న ఆఫీసర్ మెస్‌లో జరిగిన న్యూజరిగిన న్యూ ఇయర్ పార్టీలో, ఆమెకు బహుమతి వచ్చిందా అని ఆమె సీనియర్ అడిగారని అధికారి చెప్పారు. ఆమె తన వద్ద లేదని చెప్పడంతో, వింగ్ కమాండర్ బహుమతులు తన గదిలో ఉన్నాయని చెప్పి ఆమెను అక్కడికి తీసుకెళ్లాడు. అతని కుటుంబం ఎక్కడ ఉందని ఆమె అడగగా, వారు వేరే చోట ఉన్నారని చెప్పాడు. తన సీనియర్ అధికారి తనను ఓరల్ సెక్స్‌కి బలవంతం చేశాడని ఆమె ఆరోపించారు. తాను అతడిని అలా చేయడం మానేయమని పదేపదే అడిగానని, అన్ని విధాల ప్రతిఘటించడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. చివరకు అతడిని తోసి పారిపోయానని, అతడి కుటుంబం వెళ్లిన తర్వాత మళ్లీ శుక్రవారం కలుద్దామని అతడు చెప్పాడని మహిళా అధికారి పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు అధికారుల నుంచి సాయం లభించలేదని ఆమె ఆరోపించారు. అందరూ లైంగిక నేరస్తుడికే మద్దతు ఇచ్చారని ఆరోపించారు.