Leading News Portal in Telugu

Amazon Great Indian Festival: బిగ్ సేల్‌కు సిద్ధమైన అమెజాన్‌.. మొబైల్స్‌పై 40 శాతం తగ్గింపు!


  • 30 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ డేస్‌ సేల్‌
  • అతిపెద్ద సేల్‌కు సిద్ధమైన అమెజాన్‌
  • ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం తగ్గింపు
Amazon Great Indian Festival: బిగ్ సేల్‌కు సిద్ధమైన అమెజాన్‌.. మొబైల్స్‌పై 40 శాతం తగ్గింపు!

Amazon Great Indian Festival Sale 2024 Dates: పండగ వేళ ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్‌ డేస్‌ సేల్‌’ నిర్వహిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారికంగా డేట్స్ ఇంకా ప్రకటించకపోయినా.. సెప్టెంబర్ 30 నుంచి సేల్ మొదలవనునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘కమింగ్ సూన్’ అనే పోస్టర్ ఫ్లిప్‌కార్ట్‌ సైట్‌లో ఉంది. మరో ఇ-కామర్స్‌ సంస్థ ‘అమెజాన్‌’ కూడా అతిపెద్ద సేల్‌కు సిద్ధమైంది. ఏటా నిర్వహించే ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ సేల్‌ను ఈ నెలాఖరులో నిర్వహించనుంది. త్వరలో తేదీలను అమెజాన్‌ ప్రకటించనుంది.

గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ఎస్‌బీఐ కార్డు యూజర్లకు డిస్కౌంట్‌ లభించనుంది. క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందొచ్చు. సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై 40 శాతం తగ్గింపు ఉంది. శాంసంగ్‌ ఎం35 5జీ, శాంసంగ్‌ ఎస్‌24 అల్ట్రా, శాంసంగ్‌ ఏ35 మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం, గృహోపకరణాలపై 50 శాతం, ఫ్యాషన్‌ ఉత్పత్తులపై 50-80 శాతం, అమెజాన్ అలెక్స్‌ ఉత్పత్తులపై 55 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. ఈ పూర్తి డీటెయిల్స్ త్వరలోనే తెలియరానున్నాయి.