Leading News Portal in Telugu

Balineni Srinivas: వైసీపీలో కాకరేపుతున్న మాజీ మంత్రి వ్యవహారం.. ఆ నేతలతో భేటీ


  • వైసీపీలో కాకరేపుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం

  • హైదరాబాద్ లో ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమైన బాలినేని

  • వైసీపీకి బాలినేని రాజీనామా చేస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం

  • రెండు రోజుల క్రితం పార్టీ అధినేత జగన్ తో సమావేశమైన బాలినేని.
Balineni Srinivas: వైసీపీలో కాకరేపుతున్న మాజీ మంత్రి వ్యవహారం.. ఆ నేతలతో భేటీ

వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం కాకరేపుతున్నాయి. హైదరాబాద్ లో మకాం వేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. వైసీపీకి బాలినేని రాజీనామా చేస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. రెండు రోజుల క్రితం పార్టీ అధినేత జగన్ తో బాలినేని శ్రీనివాస రెడ్డి సమావేశమయ్యారు. ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలంటూ బాలినేనిని వైఎస్ జగన్ కోరగా.. అందుకు ఆయన తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన జనసేనలో చేరతారనే ఊహాగానాలు కూడా వచ్చాయి.

మరోవైపు.. భవిష్యత్ కార్యాచరణపై కార్పోరేటర్లు, అనుచరులతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమావేశమై చర్చించారు. అనంతరం.. బాలినేనితో చర్చించేందుకు మాజీ మంత్రి విడుదల రజిని, వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిని వైసీపీ అధిష్టానం రంగంలోకి దించింది. బాలినేని ఇంట్లో చాలా సేపు వీరు మంతనాలు జరిపారు.