Leading News Portal in Telugu

కేజ్రీవాల్ కు బెయిలు | supreme court grant bail ti kejriwal| delhi| liquor| scam| cbi


posted on Sep 13, 2024 11:01AM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో  అరెస్టైన కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి విదితమే. ఢిల్లీ మద్యం కుభకోణం కేసు విచారణ సమీప భవిష్యత్ లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

కాగా కేజ్రీవాల్ సాక్ష్యాలను ట్యాంపర్ చేస్తారనీ, సాక్ష్యులను ప్రభావితం చేస్తారన్న సీబీఐ వాదనలను సర్వోన్నత న్యాస్థానం తోసిపుచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలూ చేయరాదని కేజ్రీవాల్ కు షరతు విధించింది.

కేజ్రీవాల్ పై ఈడీ నమోదు చేసిన కేసులో గతంలోనే బెయిలు లభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీబీఐ నమోదు చేసిన కేసులోనూ ఆయనకు బెయిలు మంజూరైంది. కాగా కేజ్రీవాల్ కు బెయిలు మంజూరు చేస్తూ ఈడీ కేసులోని షరతులే ఇప్పుడు కూడా వర్తిస్తాయని పేర్కొంది.