- శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవస్థానం మరో అరుదైన రికార్డు..
-
ఆలయం విస్తీర్ణం.. అలానే ఆలయంలోని నంది విగ్రహానికి.. -
ఆలయ నిర్వాహణకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లండన్ లో స్థానం..

Srisailam Temple: 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.. శ్రీశైలం ఆలయం విస్తీర్ణం.. అలానే ఆలయంలోని నంది విగ్రహానికి.. ఆలయ నిర్వాహణకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లండన్ సంస్థలో స్థానం లభించింది.. ముఖ్యంగా పురాతన పరంగా.. ఆధ్యాత్మికంగా.. సాంస్కృతి, సంప్రదాయాలు.. ఆధ్యాత్మిక సత్యం యొక్క అత్యున్నత భాండాగారంతో కూడిన విలువలు గల సజీవ స్వరూపంగా.. పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉన్నందుకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో శ్రీశైల ఆలయం చేరింది.. దీనితో శ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ధ్రువీకరణ పత్రం వరించింది..
ఇక, ఈ ధ్రువీకరణ పత్రాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రెటరీ ఉల్లాజీ ఎలియజర్ అందజేశారు.. ధ్రువీకరణ పత్రం అందజేతలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం భూమండలానికి నాభిస్తానని శ్రీశైల పుట్టడం పైగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ అందించడం ఎంతు అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.. శ్రీశైల ఆలయానికి లండన్ వారిచే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు ధ్రువీకరణ పత్రం రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.. అయితే గతంలోనూ దేవస్థానంలో 7 విభాగాలకు ఐ.ఎస్.ఓ ద్వారా ధ్రువీకరణ పత్రలను అందుకుంది శ్రీశైలం మల్లన్న ఆలయం.. ఇప్పుడు శ్రీశైలం సిగలో మరో మణిహారం చేరినట్టు అయ్యింది.. ఇక, కొలిచినవారి కొంగుబంగారంగా చెప్పుకుంటారు శ్రీ శ్రీశైలం మల్లికార్జున స్వామి.. భ్రమరాంబిక అమ్మవారిని.. శ్రీశైలం నిత్యం భక్తులతో రద్దీ ఉంటుంది.. శివరాత్రి.. ఉగాది ఉత్సవాల సమయంలో.. రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తుంటారు..