Leading News Portal in Telugu

ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ


posted on Sep 14, 2024 12:26PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈ నెల 20 న జరగనుంది. హైడ్రా దూకుడుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విధానం పై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

 రాష్ట్రంలో ఇటీవలె కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాకారం కోరే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు.  కొత్తగా 200 గ్రామ పంచాయతీల ఏర్పాటు విషయంలో చర్చించనున్నారు. రుణ మాఫీ జరగలేదన్న ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను తిప్పి కొట్టేందుకు సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రైతు భరోసాపై చర్చించనున్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నిదరఖాస్తులు తీసుకోవాలో కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది.