Leading News Portal in Telugu

Bhashyam: వరద బాధితుల సహాయార్ధం “భాష్యం” రూ.4 కోట్ల విరాళం..


  • విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ‘భాష్యం’ విద్యాసంస్థలు

  • తమవంతు సహకారాన్ని అందించిన భాష్యం

  • తమ విద్యాసంస్థల తరపున మొత్తం రూ. 4 కోట్ల చెక్కును సీఎంకు అందజేత.
Bhashyam: వరద బాధితుల సహాయార్ధం “భాష్యం” రూ.4 కోట్ల విరాళం..

ఇటీవల సంభవించిన వరదల కారణంగా సర్వం కోల్పోయిన విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ‘భాష్యం’ విద్యాసంస్థలు తమవంతు సహకారాన్ని అందించాయి. ఆపన్నులను ఆదుకోవడంలో సామాజిక బాధ్యతగా ముందుండే భాష్యం విద్యాసంస్థలు తమవంతు సహాయమందించేందుకు విద్యాసంస్థల తరపున మొత్తం రూ. 4 కోట్ల చెక్కును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి శుక్రవారం అమరావతి వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చందబ్రాబునాయుడును కలిసి భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, డైరెక్టర్ భాష్యం హనుమంతరావు, భాష్యం రామకృష్ణ తనయుడు భాష్యం సాకేత్ రామ్ ల చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ చూపిన చొరవ అభినందనీయమన్నారు. మేము సైతమంటూ ఆపన్నులను ఆదుకోవడంలో భాష్యం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ రామకృష్ణను ముఖ్యమంత్రి అభినందించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. తన పిలుపు మేరకు స్పందించి సహకరించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు భాష్యం సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన తెలిపారు.